సీతమ్మ వారిని అంత మాట అంటాడా.. చెప్పు తీసుకుని కొడతా!: మహేష్ కత్తిపై నటి మాధవీలత ఆగ్రహం
- ‘సీత రావణుడి దగ్గర ఉండి ఉంటే ఎంజాయ్ చేసేదేమో’ అంటాడా?
- ఈ వ్యాఖ్యలకు నేనైతే చెప్పు తీసుకుని కొడతా
- సీతమ్మ వారిని మహిళలు స్ఫూర్తిగా తీసుకుంటారు
అసలు, వీడెవడు? వీడూవాడూ అని కెమెరాల ముందు నేను అనను. కానీ, ఈ సందర్భంలో ఒక అమ్మాయిగా నేను ఇలా అనాల్సి వస్తోంది. ఎన్ని తరాలు, యుగాలు మారినా మహాసాథ్వి సీతమ్మ వారిని భారతదేశంలో మహిళలు స్ఫూర్తిగా తీసుకుంటారు. అసలు, ఏం మాట్లాడుతున్నాడు? వేరే మతం వాళ్లను ఇలా కామెంట్ చేయగలడా?’ ‘సీత రావణుడి దగ్గర ఉండి ఉంటే ఎంజాయ్ చేసేదేమో’ అనే కత్తి వ్యాఖ్యలకు నేనైతే చెప్పు తీసుకుని కొడతా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహేష్ కత్తి దుర్మార్గాలను భరించలేకనే ఆయన భార్య వదిలేసి వెళ్లిపోయిందని, అలాంటి వ్యక్తి హిందూ దేవుళ్లపై, సీతమ్మ వారిపై వ్యాఖ్యలు చేస్తారా? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.