Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పట్లోనే నా భర్తకు సొంత విమానం ఉండేది: అలనాటి కథానాయిక కేఆర్ విజయ

  • దేవత పాత్రలు అలా వచ్చాయి 
  • వేలాయుధంతో వివాహం జరిగింది 
  • ఆయన మంచి మనసున్న మనిషి
తెలుగు తెరపై నిండుచందమామలా కనిపిస్తూ .. ఎంతోమంది హృదయాలను దోచేసిన అలనాటి కథానాయికగా కేఆర్ విజయ కనిపిస్తారు. సాంఘిక .. జానపద .. పౌరాణిక చిత్రాల్లో అద్భుతంగా నటించి మెప్పించిన ఘనత ఆమె సొంతం. ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో దేవత పాత్ర అనగానే అప్పట్లో అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు కేఆర్ విజయ. అప్పట్లో యూత్ కేఆర్ విజయ నవ్వు గురించే ఎక్కువగా మాట్లాడుకునేవారు.

అలాంటి ఆమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "శ్రీకృష్ణ పాండవీయం'లో రుక్మిణీదేవి పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ పాత్ర నాకు చాలామంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా నుంచే నన్ను దేవతా పాత్రలకి ఎక్కువగా అడిగేవారు. ప్రముఖ వ్యాపార వేత్త .. నిర్మాత అయిన 'వేలాయుధం'తో నా వివాహం జరిగింది. అప్పట్లోనే ఆయనకి సొంత విమానం .. షిప్పు ఉండేవి. అయితే నేను ఆయన ఆస్తిని చూసి ప్రేమించలేదు .. ఆయన మంచితనం .. మంచి మనసును చూసి మాత్రమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను" అని ఆమె చెప్పుకొచ్చారు.  
kr vijaya

More Telugu News