Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లో యువతిపై రౌడీషీటర్ అత్యాచారం

  • వారాసిగూడ పరిధిలోని అంబర్ నగర్ లో సంఘటన
  • అడ్డుకోబోయిన యువతి తల్లిపై రౌడీషీటర్ దాడి
  • స్థానికుల సాయంతో రౌడీషీటర్ పై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ లో ఓ యువతిపై రౌడీ షీటర్ అమీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వారాసిగూడ పరిధిలోని అంబర్ నగర్ లో ఉంటున్న ఓ యువతిపై అమీర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన యువతి తల్లిపై రౌడీషీటర్ దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధిత యువతి కుటుంబానికి చెందిన పెంపుడు శునకంపై కూడా అతను దాడి చేశాడు.

 స్థానికుల సాయంతో బాధిత యువతి చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రౌడీషీటర్ పై ఫిర్యాదు చేసింది. సదరు యువతిపై రౌడీ షీటర్ మూడు రోజుల పాటు అత్యాచారం చేశాడని, నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. కాగా, తనపై పెట్టిన కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తానంటూ బాధిత యువతిని ఫోన్ లో బెదిరించినట్టు సమాచారం.
Hyderabad
rape
rowdysheeter

More Telugu News