'త్వరగా కోలుకోవాలి డియర్' అన్న నాగార్జున.. థ్యాంక్స్ చెప్పిన సోనాలి బింద్రే!

  • కేన్సర్ తో బాధపడున్నానంటూ వెల్లడించిన సోనాలి 
  • ఆమెకు ధైర్యం చెబుతూ వెల్లువెత్తుతున్న ట్వీట్లు
  • తొందరగా కోలుకోవాలన్న నాగార్జున
తాను కేన్సర్ తో బాధపడుతున్నానంటూ సినీ పరిశ్రమను, లక్షలాది మంది అభిమానులను షాక్ కు గురిచేసింది సినీ నటి సోనాలి బింద్రే. ఈ విషయంపై ఎంతో మంది ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఆమె కూడా ఎంతో ఓపికగా రిప్లై ఇస్తున్నారు.

'నీవు తొందరగా కోలుకోవాలి. కేన్సర్ ను జయించాలన్ననీ గొప్ప సంకల్పానికి బలం చేకూరాలని కోరుకుంటున్నా డియర్' అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా 'థ్యాంక్స్ నాగ్' అంటూ సోనాలి రిప్లై ఇచ్చింది.

సోనాలి బింద్రే ఇచ్చిన మరికొన్ని జవాబులు..
ఫరాఖాన్ నీ టేస్టీ వంటను మిస్ అవుతున్నా. నీ చేతి వంటకోసమైనా త్వరగా ముంబై వస్తా.

అనిల్ కపూర్ మన అందమైన వీధిని మిస్ అవుతున్నా. త్వరలోనే చూస్తానని ఆశిస్తున్నా. 
Go Back to Shorts
nagarjuna
sonali bendre
cancer
tweet

More Telugu News