ఎల్లుండి సింగపూర్ వెళ్తున్న చంద్రబాబు

  • చంద్రబాబు సింగపూర్ పర్యటన ఖరారు
  • ఎల్లుండి నుంచి 10వ తేదీ వరకు పర్యటన
  • ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొననున్న సీఎం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఎల్లుండి ఆయన సింగపూర్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈనెల 10వ తేదీ వరకు సింగపూర్ లో పర్యటిస్తారు. ప్రపంచ నగరాల సదస్సులో... అమరావతిపై జరిగే చర్చలో ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటనకు ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సీఆర్డీయే, సీఎం కార్యాలయ అధికారులు తదితరులు వెళ్లనున్నారు. పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి పలువురితో సమావేశం కానున్నారు. 
Go Back to Shorts
Chandrababu
singapore

More Telugu News