'ది జియో గిగా ఫైబర్'... ముఖేష్ అంబానీ న్యూ ఎనౌన్స్ మెంట్!
- దేశవ్యాప్తంగా విస్తరిస్తాం
- ప్రతి ఇల్లూ స్మార్ట్ గా మారుతుంది
- ఏజీఎంలో ముఖేష్ అంబానీ
డిజిటల్ షాపింగ్ దగ్గరవుతుందని, ప్రతి ఇల్లూ స్మార్ట్ హోమ్ గా మారుతుందని, సీసీ కెమెరాల నుంచి, గృహోపకరణాల వరకూ చూపుడు వేలు, నోటి మాట ద్వారా నియంత్రణలో ఉంటాయని అన్నారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, మరే దేశంలో ఉన్నా, తన స్మార్ట్ ఫోన్ నుంచి ఇంటిని నియంత్రణలో ఉంచుకోవచ్చని ముఖేష్ తెలిపారు. జియో ఫోన్, జియో గిగా ఫైబర్ గురించి తన కుమార్తె ఈషా, కుమారుడు ఆకాష్ వెల్లడిస్తారని చెప్పి, తన ప్రసంగాన్ని ముగించారు.