ఢిల్లీని పాలించాల్సింది ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే... ఎల్జీ కాపలాదారు మాత్రమే!: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- ఢిల్లీ ముఖ్యమంత్రి నిర్ణయాలే ఫైనల్
- నచ్చకుంటే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలి
- స్నేహపూర్వకంగా ఎల్జీ, ప్రభుత్వం వ్యవహరించాలి
- తీర్పు సందర్భంగా జస్టిస్ చంద్రచూద్
ఇదే సమయంలో ఎల్జీ సమ్మతి కోసం వేచి చూడక్కర్లేదని తెలిపింది. ఎల్జీ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని, ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకుంటే, ఆ విషయాన్ని రాష్ట్రపతికి చేరవేయాలే తప్ప, మొండిపట్టు పట్టరాదని తెలిపింది. ఈ కేసు ఎంతో ప్రత్యేకమైనదని అభిప్రాయపడ్డ జస్టిస్ చంద్రచూద్, ప్రజల నిర్ణయాన్ని ఎవరైనా ఆమోదించాల్సిందేనని అన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అడ్డుకోవచ్చని, ప్రతి విషయానికీ అడ్డుపడరాదని తీర్పు సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ గా వ్యవహరించే లెఫ్టినెంట్ గవర్నర్, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను అడ్డుకోలేరని ఆయన అన్నారు. అటు ఎల్జీ, ఇటు సీఎం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే ఎటువంటి సమస్యా ఉండదని అభిప్రాయప్డారు. ఇక ఈ తీర్పు చాలా బాగుందని మాజీ అటార్నీ జనరల్ సొలీ సొరాబ్జీ వ్యాఖ్యానించారు.