నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: పోలీసులతో కత్తి మహేష్
- ఎలాంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదు
- భారత న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది
- పోలీసుల విచారణలో కత్తి మహేష్
నిన్న రాత్రి ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు పలు కోణాల్లో విచారించగా, తాను చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తినని, భారత న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని తెలిపినట్టు సమాచారం. గతంలోనూ తాను ఎన్నడూ ఏ దేవుడినీ కించపరచలేదని ఈ సందర్భంగా కత్తి పోలీసులతో అన్నట్టు తెలుస్తోంది. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలన్న ఉద్దేశం తనకు లేదని వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.