నటుడు రవిబాబంటే అంతే మరి.. వైరల్ అవుతున్న ఫిట్‌నెస్ చాలెంజ్ వీడియో!

  • ఫిట్‌నెస్ చాలెంజ్ వీడియో విడుదల
  • పందిపిల్లతో వ్యాయామం చేసిన రవిబాబు
  • మీరెందుకు చేయరని ప్రశ్న
తెలుగు చిత్రపరిశ్రమలో నటుడు, దర్శకుడు రవిబాబు కొంచెం ప్రత్యేకం. ఆయన ఆలోచనలు, చేష్టలు కొంచెం వెరైటీగా ఉంటాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ‘అదుగో’ పేరుతో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ‘బంటి’ అనే పందిపిల్ల ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. తాజాగా ఫిట్‌నెస్ చాలెంజ్‌లో భాగంగా రవిబాబు పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది.

తన సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పందిపిల్లకు ఆమధ్య పళ్లు తోముతూ కనిపించిన రవిబాబు.. తాజాగా దానితో కలిసి వ్యాయామం చేస్తూ కనిపిస్తున్నాడు. పందిపిల్లను వీపుపై కూర్చోబెట్టుకుని పుషప్స్ తీశాడు. ఫిట్‌నెస్ కోసం బంటి కూడా వ్యాయామం చేస్తోందని, మరి మీరెందుకు చేయరని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కామెంట్లు, షేర్లతో హోరెత్తుతోంది.
Go Back to Shorts
Tollywood
Actor
Ravibabu
Pig
Adugo

More Telugu News