Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘సంజు’ మూడు రోజుల వసూళ్లు.. రికార్డులు బద్దలు

  • ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన సినిమా
  • తొలి రోజున రూ.34.75 కోట్లు 
  • రెండోరోజు రూ.38.60 కోట్లు
  • మూడో రోజు (నిన్న) రూ.46.71 కోట్లు 
బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధానపాత్రలో సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘సంజు’ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సాధించిన కలెక్షన్ల గురించి సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌లో వివరాలు తెలిపారు. తొలిరోజున రూ.34.75 కోట్లు రాబట్టి ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన సినిమాగా నిలిచింది. కాగా, రెండోరోజు రూ.38.60 కోట్లు, మూడో రోజు (నిన్న) రూ.46.71 కోట్లు వసూలు చేసింది. 2018లో విడుదలైన సినిమాల్లో వారాంతంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘సంజు’ నిలిచింది. 
sanju
Bollywood

More Telugu News