నేను గర్భిణిని.. ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడకండి!: సానియా మీర్జా ఆగ్రహం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను గర్భిణిని.. ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడకండి!: సానియా మీర్జా ఆగ్రహం

  • నాకు బాబు పుట్టాలని కోరుకుంటున్నామని కొందరు అంటున్నారు 
  • బాబుకి బదులు అమ్మాయి పుట్టాలని కోరుకోండి
  • బాబే పుట్టాలని ఎందుకు అనుకుంటున్నారు?
భారత టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జాకు ట్విట్టర్‌లో ఓ అభిమాని చేసిన కామెంట్ కోపం తెప్పించింది. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న సానియా తనకు సంబంధించిన ఓ ఫొటోను తాజాగా ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. దానికి ఓ అభిమాని కామెంట్ చేస్తూ సానియా మీర్జాకు కుమారుడు పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నాడు. అతడి కామెంటుకు సానియా స్పందిస్తూ... తాను ఇప్పుడు గర్భిణినని, కొంతమందిని కలిసినప్పుడు ఇలాగే బాబు పుట్టాలని కోరుకుంటున్నామని తనతో చెబుతారని చెప్పింది.

అయితే ఇలా ఆలోచించే వాళ్లందరికీ తానొక విన్నపం చేస్తున్నానని, ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడకండని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ తన కోసం ఎవరయినా ప్రార్థించేటట్లయితే తనకు బాబు బదులు అమ్మాయి పుట్టాలని కోరుకోండని సమాధానం ఇచ్చింది. బాబే పుట్టాలని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నిస్తూ.. ఆడపిల్లలు పుడితే ఏమవుతుందని నిలదీసింది. అవగాహన లేని వాళ్లు ఇలా ఆలోచిస్తారని విమర్శించింది.
Sania Mirza
tennis
Twitter

More Telugu News