రిలయన్స్ ఫ్రెష్ పప్పుల్లో పురుగులు, కాలం చెల్లిన బాదంపాలు... జరిమానా విధించిన అధికారులు!
- వరంగల్ కేయూ క్రాస్ రోడ్స్ లో స్టోర్
- పలు ఫిర్యాదులు రావడంతో శానిటరీ విభాగం తనిఖీ
- రూ. 10 వేల జరిమానా విధించిన అధికారులు
అక్కడి పప్పులో పురుగులు కనిపించడం, కాలం చెల్లిన పానీయాలు ఉండటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రూ. 10 వేల జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ విషయమై స్టోర్ మేనేజర్ వివరణ ఇస్తూ, ఈ సెక్షన్ లో పనిచేసే ఉద్యోగి గత మూడు రోజులుగా రాకపోవడంతోనే కొన్ని ఉత్పత్తులను తొలగించలేకపోయామని, భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరుగకుండా చూసుకుంటామని చెప్పారు.