కొత్త పోలీస్ బాస్ వచ్చారు... ఏపీ డీజీపీగా ఆర్పీ ఠాకూర్

  • ఉత్తర్వులు వెలువరించిన చంద్రబాబు సర్కారు
  • ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఠాకూర్
  • 1986 బ్యాచ్ అధికారి ఠాకూర్
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ ను రాష్ట్ర డీజీపీగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డీజీపీ పదవికి గౌతమ్ సవాంగ్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, చంద్రబాబు ఆర్పీ ఠాకూర్ వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. అంతకుముందు ప్రస్తుత డీజీపీ మాలకొండయ్యకు పోలీసు అధికారులు, డీజీపీ కార్యాలయ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. 1986 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి ఠాకూర్, ఈ సాయంత్రం లేదా రేపు కొత్త డీజీపీ బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 
Go Back to Shorts
RP Thakur
Andhra Pradesh
DGP
Police Boss

More Telugu News