అండగా ఉంటాడని నమ్మితే వంచించాడు... నటిగా అవకాశాలిప్పిస్తానని వాడుకున్నాడు: సమీర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అండగా ఉంటాడని నమ్మితే వంచించాడు... నటిగా అవకాశాలిప్పిస్తానని వాడుకున్నాడు: సమీర

  • టీవీ సీరియల్స్ లో నటిస్తున్న సమీర
  • ప్రియుడితో విభేదాలు వచ్చి విడిపోయిన సమీర
  • కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ
అర్ధరాత్రి రోడ్డుపై తన బట్టలు చించి పరుగులు పెట్టించిన మాజీ ప్రియుడు ఫిరోజ్ ఖాన్, అతని తాజా ప్రియురాలు కీర్తీరెడ్డిలపై పోలీసులు ఇంతవరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఓ పబ్ లో బ్లేడ్ దాడికి గురైన షేక్ సమీర మీడియా ముందు వాపోయింది. తనకు ఫిరోజ్ కు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి వెల్లడించిన ఆమె, తమది గుంటూరు జిల్లా అని, టీవీల్లో నటిస్తూ, దుబాయ్ లో ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నానని చెప్పింది. గుట్కా వ్యాపారం చేస్తున్న విజయవాడకు చెందిన ఫిరోజ్ ఖాన్ పరిచయం కాగా, తామిద్దరం కొంతకాలం ప్రేమించుకున్నామని చెప్పింది. అతను అండగా ఉంటాడని నమ్మానని అంది.చేతిపై బ్లేడ్ గాయాలు చూపుతున్న సమీర

టీవీ సీరియల్స్ లో అవకాశాలు ఇప్పిస్తానని తనను ఫిరోజ్ దారుణంగా మోసం చేశాడని, మనస్పర్థలు వచ్చి తామిద్దరం విడిపోయామని చెప్పింది. ఆ తరువాత కీర్తితో ఫిరోజ్ పరిచయం పెంచుకున్నాడని, తన చేతులపై బ్లేడుతో కీర్తే గాట్లు పెట్టిందని చెబుతూ వాటిని మీడియాకు చూపింది. తనను గంటపాటు అర్ధనగ్నంగా రోడ్డుపై నిలబెట్టారని, తననుంచి లక్షన్నర విలువ చేసే వాచీ, రెండు సెల్ ఫోన్లను లాక్కెళ్లారని వాపోయింది. పోలీసులు ఇంతవరకూ వారిని అరెస్ట్ చేయలేదని, తన పలుకుబడితో పోలీసులను ఫిరోజ్ మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించింది. ఇప్పటికీ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతూ, ఫిరోజ్ కు, తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డును వినిపించింది.
Sameera
Tv Actor
Pub
Blade
Police

More Telugu News