బాబు గోగినేనికి మద్దతు పలికిన కత్తి మహేష్
- బాబు గోగినేనిపై పోలీసు కేసు నమోదు
- మతం పేరిట వ్యాపారాన్ని వ్యతిరేకించినందునే
- కేసులను తొలగించాలని కత్తి డిమాండ్
మతం పేరిట జరుగుతున్న వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నందునే గోగినేనిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించాడు. ఆయన ప్రస్తుతం జన జీవన స్రవంతిలో లేరని, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయాన్ని చూసి ఈ కేసు పెట్టారని కత్తి అన్నారు. ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాతనే ఏం జరిగిందన్న విషయం తెలుస్తుందని చెప్పాడు. ఆయన ప్రాణాలకు హాని కలిగే ప్రమాదం ఉందని, ఆయనకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశాడు. ఆయనపై కేసులను వెంటనే తొలగించాలని కోరాడు.