అమరావతిలో ప్రముఖ ఎమ్మెన్సీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలు ఇవిగో!

  • తొలి విడతగా 250 మంది ఆర్థిక సేవలు అందించే అభ్యర్థులు
  • 2017,18లో బీకాం, ఎంబీఏ ఫైనాన్స్ విభాగం అభ్యర్థులు అర్హులు
  • వెబ్‌సైట్‌ http://jobskills.apssdc.in/sdc/
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రకటన
అమరావతిలో త్వరలో ప్రారంభం కానున్న ప్రముఖ ఎమ్మెన్సీ, టాప్ ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒకటైన ఓ సంస్థలో ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థ త్వరలోనే తన ఫైనాన్సియల్ సర్వీసెస్ బ్రాంచిని అమరావతిలోని మేధ టవర్స్ లో ప్రారంభించబోతోందని, ఆగస్టు 1 నుంచి కార్యకలాపాలు మొదలవుతాయని ఏపీఎస్‌ఎస్‌డీసీ అధికారులు తెలిపారు.

అందులో భాగంగా తొలి విడతగా సంస్థకు 250 మంది ఆర్థిక సేవలు అందించే అభ్యర్థులు అవసరం అవుతారని, రాబోయే 10 నెలల్లో ఈ సంఖ్య 700 వరకు పెంచుతారని అధికారులు తెలిపారు. సంస్థలో ఉద్యోగాల కోసం 2017,18లో బీకాం, ఎంబీఏ ఫైనాన్స్ విభాగాల్లో 70 శాతం మార్కులతో పాసై ఉండి మంచి కమ్యునికేషన్ స్కిల్స్, కేపిటల్ మార్కెట్స్ పై నాలెడ్జి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు http://jobskills.apssdc.in/sdc/ లో జూలై 6వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్స్ గడువు ముగిసిన తరువాత ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసుకుని రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
amaravati
Andhra Pradesh
jobs

More Telugu News