అగ్నిపర్వతం నుంచి గాల్లోకి భారీగా బూడిద... బాలి అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత
- గాల్లోకి 8,200 అడుగుల ఎత్తువరకు వ్యాపించిన బూడిద
- విమానాల ఇంజన్లకు నష్టం వాటిల్లుతుందని అంచనా
- దీంతో సర్వీసుల నిలిపివేత
గతేడాది చివర్లో మౌంట్ అగంగ్ అగ్నిపర్వతం పేలిపోవడంతో డిసెంబర్ లో విమానాశ్రయాన్ని కొన్ని రోజుల పాటు మూసేశారు. అప్పటి నుంచి ఇది నిద్రాణంగానే ఉంది. తాజాగా ఈ అగ్నిపర్వతం చురుగ్గా మారి బూడిదను వెదజల్లుతోంది. ఆ గాలిలోంచి విమానాలు ప్రయాణిస్తే ఇంజన్లకు నష్టం వాటిల్లుతుందన్న అంచనాతో సర్వీసులను రద్దు చేశారు. విమానాశ్రయం నుంచి మౌంట్ అగంగ్ 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.