ప్రధాని మోదీ అంటే నాకు ప్రాణం: డీఎస్ కుమారుడు
- నా తండ్రి నన్ను బీజేపీలోకి పంపలేదు
- టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నా
- రానున్న ఎన్నికల్లో కవితకు ప్రజలు బుద్ధి చెబుతారు
అర్థం లేకుండా తన కుటుంబంపై విమర్శలు చేయడం తగదని అన్నారు. తాను ముందు నుంచి బీజేపీకి మద్దతుగా ఉన్నానని... ఇందులో తన తండ్రి ప్రమేయం లేదని చెప్పారు. ప్రధాని మోదీ కోసం తాను ప్రాణమిస్తానని తెలిపారు. గత నాలుగేళ్లలో నిజామాబాద్ జిల్లాకు ఎంపీ కవిత చేసిందేమీ లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కవితకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.