shakalaka shankar: గెటప్ శీను అంటే నాకు ఇష్టం: షకలక శంకర్
- చలాకీ చంటి వలన 'జబర్దస్త్' చేశాను
- నాకు పేరు రావడానికి ఆయనే కారకుడు
- గెటప్ శీను నాకు మంచి స్నేహితుడు
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్, త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉండగా, 'జబర్దస్త్' టీమ్ లో ఇష్టమైన కమెడియన్ ఎవరు? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.
అందుకాయన స్పందిస్తూ . 'జబర్దస్త్'లో నాకు ఇష్టమైన కమెడియన్ గెటప్ శీను. కామెడీ చేయడంలో నాకంటే సీనియర్ .. నాకంటే మంచి టైమింగ్ వున్నవాడు. నేను 'జబర్దస్త్' చేస్తూ ఉండగా తన దగ్గర నుంచి కొంత నేర్చుకున్నాను. ఆయన చేసిన కొన్ని సూచనలు నా కెరియర్ కి బాగా ఉపయోగపడ్డాయి. అందువలన నాకు శీను అంటే ఎక్కువ ఇష్టం. శీను నాకు మంచి స్నేహితుడైతే .. చలాకీ చంటి నాకు గురువులాంటివాడని చెప్పాలి. నేను 'జబర్దస్త్'లోకి వెళ్లడానికి .. మంచి పేరు రావడానికి చంటి కారణం" అని చెప్పుకొచ్చాడు.