టీటీడీ బోర్డు మాజీ మెంబర్ శేఖర్ రెడ్డి నిర్దోషి... సీబీఐ కేసులన్నిటినీ కొట్టేసిన మద్రాసు హైకోర్టు
- శేఖర్ రెడ్డిపై రెండు కేసులు పెట్టిన సీబీఐ
- 2016లో ఆయన ఇంటి నుంచి రూ. 34 కోట్లు స్వాధీనం
- సరైన సాక్ష్యాలు లేవన్న మద్రాసు హైకోర్టు
2016లో ఆయన నివాసం, కార్యాలయంలో రూ. 34 కోట్లను ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. శేఖర్ రెడ్డిపై రెండు కేసులను సీబీఐ నమోదు చేయగా, వాటిని విచారించిన న్యాయస్థానం, నిందితులు దోషులని పేర్కొనడానికి సరైన సాక్ష్యాలు లేవని అభిప్రాయపడింది.