ఓ రాత్రివేళ కారులో వస్తుండగా టైర్ ఊడిపోయింది: గెటప్ శీను
- ఒకసారి 'బళ్లారి' నుంచి బయల్దేరాం
- అప్పటికే బాగా చీకటిపడింది
- అదృష్టం బాగుండి బయటపడ్డాం
కారు ఒకవైపుకు వాలిపోవడమే కాకుండా పెద్దగా సౌండ్ చేస్తోంది. కారు ఎందుకు ఓ పక్కకి ఒరిగిందో .. ఎందుకు సౌండ్ వస్తుందో తెలుసుకోకుండా డ్రైవర్ అలాగే నడిపేస్తున్నాడు. ఆ సౌండ్ కి నాకు మెలకువ వచ్చి లేచాను .. కారు ఆపమని చెప్పి దిగి వెళ్లి చూశాను. కారుకి వెనక చక్రం ఒకటి లేదు .. ఎక్కడో ఊడిపోయింది. ఒక్కసారిగా గుండె ఝల్లుమనడంతో ఆ విషయం మిగతా వాళ్లకు చెప్పాను. మా డ్రైవర్ తాగేసి ఉండటం వలన ఆయన టైర్ ఊడిపోయిన విషయాన్ని గమనించలేదు. అదృష్టం బాగుండి అందరం బయటపడ్డాం" అని అన్నాడు.