24 మందికి వీసా కోరిన కేసీఆర్ కార్యాలయం... నలుగురికి మాత్రం ఇస్తామన్న యూఎస్ కాన్సులేట్!
- అమెరికా తెలంగాణ సదస్సుకు రాష్ట్రం నుంచి నలుగురే
- మే 28 తరువాత 70 శాతం దరఖాస్తుల తిరస్కరణ
- 4 వేల మంది ఇంటర్వ్యూకు వెళితే 1,350 మందికే వీసాలు
గత మేలో బీ1బీ2 దరఖాస్తుల్లో 65 శాతం మందికి వీసాలు మంజూరుకాగా, ఈ నెలలో 30 శాతం మందికే వీసాలు ఇచ్చారు. మే నెలలో 12 నుంచి 28 తేదీల మధ్య 3 వేల మందికి పైగా వీసా ఇంటర్వ్యూలకు హాజరుకాగా, 1,950 మందికి వీసా మంజూరైంది. ఆపై మే 29 నుంచి జూన్ 22 మధ్య 4 వేల మంది వీసాలకు దరఖాస్తులు చేసుకోగా, 1,350 మందికి మాత్రమే వీసాలు ఇచ్చారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయాలని యూఎస్ ఇమిగ్రేషన్ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని కాన్సులేట్ సిబ్బంది వెల్లడించారు.