Krishna District: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నలుగురు బీటెక్‌ విద్యార్థుల గల్లంతు

షార్ట్స్‌లో చూడండి
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నలుగురు బీటెక్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. సరదాగా గడుపుదామని వచ్చిన సదరు విద్యార్థులు నీళ్లలో పడి కొట్టుకుపోయారు. తొలుత ఒక విద్యార్థి రైలింగ్‌ దాటి అవతలివైపు వెళ్లడంతో అతడు నీళ్లలో పడిపోయాడని, అతడిని కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారని తెలిపారు.

గల్లంతయిన వారు కంచికచర్లలో మిక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోన్న ప్రవీణ్‌ (18), చైతన్య (18), శ్రీనాథ్‌ (19), కుమార్‌ (19) అని అధికారులు తెలుసుకున్నారు. నాలుగు రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌, ఎస్పీలతో మాట్లాడారు. బాధితుల కుటుంబాలకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందివ్వాలని సూచించారు.    
Go Back to Shorts
Krishna District
river
students

More Telugu News