బీజేపీ చిక్‌మగళూరు జనరల్ సెక్రటరీ దారుణ హత్య!
- కత్తులతో పొడిచి చంపిన దుండగులు
- ప్రాణం పోయేంత వరకు చూసి పరారీ
- నిందితుల కోసం పోలీసుల వేట
ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న అన్వర్‌పై బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. రక్తపు మడుగులో కుప్పకూలిపోయిన అన్వర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన ప్రాణాలు విడిచేంత వరకు దుండుగులు అక్కడే ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అన్వర్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు.