విజయ్ ఫస్టులుక్ పై రచ్చ.. సిగరెట్ తాగుతున్న స్టిల్ పై విమర్శలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్ ఫస్టులుక్ పై రచ్చ.. సిగరెట్ తాగుతున్న స్టిల్ పై విమర్శలు!

  • విజయ్ తాజా చిత్రంగా 'సర్కార్'
  • ఫస్టులుక్ పోస్టర్ పై విమర్శలు 
  • విజయ్ అభిమానుల్లో ఆవేశం
తమిళ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు .. ఈ రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తాజా చిత్రం నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి 'సర్కార్ ' అనే టైటిల్ ను ఖరారు చేసి .. కొంతసేపటి క్రితమే ఫస్టులుక్ ను వదిలారు. ఈ పోస్టర్ లో విజయ్ సిగరెట్ తాగుతూ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఆయనలా సిగరెట్ కాలుస్తున్న పోజే ఇప్పుడు విమర్శలకు కారణమైంది.

తమిళనాడు ఎంపీ .. కేంద్ర మాజీ ఆరోగ్యశాఖ మంత్రి 'అన్బుమని రామదాస్' విజయ్ పోస్టర్ పై స్పందించాడు. "ఈ పోస్టర్ ద్వారా సిగరెట్ ను ప్రమోట్ చేస్తున్నావా? ఇలా చేయడం నిజంగా సిగ్గుచేటు. ఒక నటుడిగా స్మోకింగ్ ను ప్రమోట్ చేయకపోవడం నీ బాధ్యత" అంటూ ఆయన విమర్శించారు. 'సినిమాల్లో సిగరెట్ కాల్చనని గతంలో అన్నావు .. ఇప్పుడు చేసిందేమిటి' అంటూ ప్రశ్నించారు. అంతేకాదు .. గతంలో 'ఇకపై సినిమాల్లో సిగరెట్ కాల్చను' అంటూ విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ కి సంబంధించిన పేపర్ కటింగ్ ను కూడా ఆయన ఈ ట్వీట్ కి జత చేశారు. దాంతో ఆయన ధోరణి పట్ల విజయ్ అభిమానులు మండిపడుతున్నారు.    
vijay
keerti suresh

More Telugu News