Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పసుపుతాడు మెడలో కట్టి ఫేస్ బుక్ లో పోస్టులు... ఇంట్లో నిలదీయడంతో యువతి ఆత్మహత్య!

  • ఐదు రోజుల క్రితం అమ్మాయిని పెళ్లి చేసుకున్న బాబు
  • ఫొటోలు చూసి కుమార్తెను నిలదీసిన తల్లిదండ్రులు
  • మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న భవాని
  • పరారీలో ఉన్న బాబు కోసం పోలీసుల గాలింపు
ప్రేమిస్తున్నానంటూ, ఇంకా మైనారిటీ తీరని బాలిక మెడలో పసుపుతాడు కట్టిన యువకుడు, ఆ ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేయగా, వాటిని చూసిన తల్లిదండ్రులు మందలించారన్న మనస్తాపంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పరిధిలోని మియాపూర్ లో కలకలం రేపుతోంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, బాబు అనే యువకుడు గత కొంతకాలంగా భవాని అనే 17 సంవత్సరాల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. భవానిని తన ఇంటికి తీసుకు వెళ్లి, మెడలో ఐదు రోజుల క్రితం పసుపుతాడు కట్టి, ఆపై ఆమెను ఇంటికి పంపించిన బాబు, ఆ ఫొటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు.

 వీటిని చూసిన బాబు ఫ్రెండ్స్ విషయాన్ని భవాని బంధువుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఆమెను మందలించారు. అతను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని చెప్పిన భవాని, నిన్న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భవాని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న బాబును త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. 
Hyderabad
Police
Sucide
Bhavani
Babu

More Telugu News