అలా చంద్రబాబు బెదిరించడం గర్హనీయం... నాయీ బ్రాహ్మణుల సమస్యలపై జగన్ ట్వీట్
- తమ గోడు చెప్పుకోవడానికి నాయీ బ్రాహ్మణులు వచ్చారు
- దేవుడిచ్చిన వరంలా రూ.25 చొప్పున ఇస్తామన్నారు
- చంద్రబాబు హావభావాలు బాగోలేవు
- నియంత స్వభావాలు కళ్లకు కట్టినట్లు కనపడ్డాయి
తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారిని బెదిరించడం గర్హనీయమని, పైగా తలనీలాలు తీస్తున్నందుకు రూ.25లు చొప్పున ఇస్తానంటూ, ఏదో దేవుడిచ్చిన వరం మాదిరిగా చంద్రబాబు హావభావాలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. ఆయనలోని అహంకార, నియంత స్వభావాలను కళ్లకు కట్టినట్లు చూపించాయని విమర్శించారు.