అమ్మ ఒట్టేయించుకుంది .. మందు మానేశాను!: కమెడియన్ శ్రీనివాస రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మ ఒట్టేయించుకుంది .. మందు మానేశాను!: కమెడియన్ శ్రీనివాస రెడ్డి

  • ఓ రోజున స్నేహితుడి పెళ్లికి వెళ్లాను
  • అక్కడ అందరం కలిసి సందడి చేశాం 
  • ఇంటికి వచ్చాక అమ్మకి దొరికిపోయాను
ప్రేక్షకులకు టచ్ లో ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన అవకాశాలను వదులుకోకుండా చేస్తూ వెళుతున్నాడు శ్రీనివాసరెడ్డి. ఒక వైపున స్టార్ హీరోలకి ఫ్రెండ్ పాత్రల్లో నవ్విస్తూనే .. మరో వైపున ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూనే .. హీరోగాను నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి శ్రీనివాస రెడ్డి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.

 "ఒకసారి నేను మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాను. చాలా రోజుల తరువాత అందరం కలిశాం కదా .. అందరం కలిసి తలో బీర్ వేశాము. ఆ తరువాత ఎవరింటికి వాళ్లం వెళ్లిపోయాము. నేను వెళ్లగానే మా అమ్మ నన్ను తన ఎదురుగా కూర్చోబెట్టింది. 'ఊళ్లో వాళ్లంతా ఏంటి మీ అబ్బాయిని అలా వదిలేశారు .. ఏమవుతాడో ఏంటో అంటూ వుంటే భయం వేస్తుందిరా .. అయినా నువ్ ఏం చేసేది నాకు తెలుస్తూనే ఉంటుందనే విషయం మరిచిపోకు' అంది. దాంతో 'ఇప్పుడేమైనా తెలిసిందా ?' అని అడిగాను నేను. 'నేను తాగాను అనే విషయం ఆమెకి అర్థమైపోయింది .. వెంటనే నన్ను గట్టిగా పట్టుకుని .. ఇకపై తాగను అని ప్రామిస్ చేయించుకుంది. అంతే, ఆ రోజు నుంచి ఇప్పటివరకూ .. అంటే 15 సంవత్సరాలుగా మద్యం జోలికి వెళ్లలేదు" అని ఆయన చెప్పారు.   
srinivas reddy

More Telugu News