రిలయన్స్ జియో యూజర్లకు ఇకపై నిత్యం మరింత ఉచిత డేటా
- అన్ని ప్లాన్లలో ప్రతి రోజూ అదనంగా 1.5 జీబీ డేటా
- ప్లాన్ల ప్రయోజనాల్లో సవరణలు
- ఈ నెల 30 వరకు ఆఫర్
ఇక ఈ ప్లాన్ లో ఉచితంగా అపరిమిత కాల్స్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లను కూడా ఉచితంగా పొందొచ్చు. రిలయన్స్ జియోలో రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్లలో ప్రస్తుతం ప్రతి రోజూ 1.5 జీబీ లభిస్తుండగా, ఇకపై రోజూ 3జీబీ డేటా ఉచితంగా పొందొచ్చు. రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్లలో 2జీబీ డేటాకు బదులు 3.5 జీబీ డేటాను రోజూ పొందొచ్చు. అలాగే, ప్రతి రోజూ 4జీబీ డేటాతో కూడిన రూ.509 ప్లాన్ లో ఇకపై ప్రతి రోజూ 5.5 జీబీ డేటా లభిస్తుంది. రూ.799తో కూడిన 5జీబీ డేటా ప్యాక్ లో రోజూ 6.5 జీబీ డేటాను పొందొచ్చు.