నవాజ్ షరీఫ్ భార్య ఆరోగ్య పరిస్థితి విషమం.. 'హైలీ క్రిటికల్' అన్న లండన్ డాక్టర్లు
- మృత్యువుతో పోరాడుతున్న కుల్సూమ్ నవాజ్
- ఇంకా మెరుగుపడని ఆరోగ్యం
- లండన్ లోనే ఉండిపోయిన నవాజ్ షరీఫ్
కాగా, గతేడాది ఆగస్టులో కుల్సూమ్ నవాజ్ గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచీ ఆమెకు పలు సర్జరీలు నిర్వహించారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమె పరిస్థితి విషమించడంతో లండన్ తరలించారు. ఈ క్రమంలో ఈ నెల 14న ఆమె అకస్మాత్తుగా గుండెపోటుకు గురవడంతో ఐసీయూకి తరలించి, వెంటిలేటర్స్ పై ఉంచి చికిత్స చేస్తున్నారు.
ఈ వార్త తెలియగానే నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మర్యం నవాజ్ హుటాహుటీన లండన్ చేరుకున్నారు. డాక్టర్ల సూచనపై అప్పటి నుంచీ వారు అక్కడే వుండిపోయారు. అయితే, నవాజ్, కూతురు మర్యం స్వదేశంలోని కోర్టు కేసుల రీత్యా వెళ్లవలసి వుంది. దీంతో కోర్టుకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరుతూ వారు దరఖాస్తు చేసుకున్నారు.