ఆదివారాల్లో రైళ్లు మరింత ఆలస్యం... అవసరమైతే ఉచిత భోజనం అందిస్తామని ప్రకటన
- ఆదివారాల్లో ఆరు గంటల మేర ట్రాక్ నిర్వహణ పనులు
- మిగిలిన రోజుల్లో రోజుకు రెండు గంటల చొప్పున
- ఐదారు గంటలు ఆలస్యమైతే రిజర్వ్ డ్ ప్రయాణికులకు ఉచిత భోజనం
ఆగస్ట్ 15 నాటికి కొత్త టైంటేబుల్ ను ప్రకటిస్తామని, అందులో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆలస్యంగా నడిచే రైళ్ల సమాచారం ఉంటుందని మంత్రి తెలిపారు. ఓ ప్రణాళిక మేరకు నిర్వహణ, మరమ్మతుల పనులు చేపట్టాలని గత వారం రోజులుగా అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా నిర్ణయించినట్టు చెప్పారు. ఈ పనులను ఆదివారాల్లో ఆరు గంటల వరకు, మిగిలిన రోజుల్లో రోజుకు 2 గంటల మేర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.