శ్రీలంక కెప్టెన్ చండీమల్ బాల్ ట్యాంపరింగ్ నిజమే.. చక్కర్లు కొడుతున్న వీడియో!
- జేబులో చేయిపెట్టి ఏదో నోట్లో వేసుకున్న చండీమల్
- బంతిని మరింత షైన్ చేసే ప్రయత్నం
- టాంపరింగ్ ను బయటపెట్టిన వీడియో
కాగా, చండీమల్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు గుర్తించిన ఫీల్డ్ అంపైర్లు బంతిని మార్చడంతో శ్రీలంక ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. అంపైర్ తీరును నిరసిస్తూ మైదానం వీడారు. దీంతో రెండు గంటల పాటు మ్యాచ్ నిలిచిపోయింది. ఐతే, అంపైర్లతో పలు దఫాల చర్చల తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి రావడతో మ్యాచ్ కొనసాగింది.