ఎయిర్ టెల్ నుంచి రూ.597 ప్లాన్... వ్యాలిడిటీ 168 రోజులు
- అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం
- ప్లాన్ వ్యాలిడిటీలో 10 జీబీ డేటా మాత్రమే ఉచితం
- అదనపు డేటా కోసం టాపప్ రీచార్జ్
తక్కువ డేటా వినియోగించే వారు, దీర్ఘకాలం వ్యాలిడిటీని కోరుకునే కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకంగా ఇది కనిపిస్తోంది. అయితే, ఈ ప్లాన్ ప్రస్తుతానికి కొన్ని సర్కిళ్లలోనే అందుబాటులోకి వచ్చినట్టు సమాచారం. ఎయిర్ టెల్ లో దీర్ఘకాలం వ్యాలిడిటీతో కూడిన మరో ప్లాన్ రూ.995 కూడా ఉంది. దీని వ్యాలిడిటీ ఆరు నెలలు. కాల్స్ తోపాటు రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. కాకపోతే నెలకు ఒక జీబీ డేటా మాత్రమే ఉచితంగా లభిస్తుంది.