మనం మనుషులం.. సిగ్గుపడండి: తమిళ నటుడు వివేక్

  • మహారాష్ట్రలో ఎస్సీ యువకులపై దాడి
  • దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు
  • మనం ముందు మనుషులమన్న వివేక్
మహారాష్ట్రలో ఎస్సీ యువకులపై జరిగిన దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఎస్సీ యువకులపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. వారిని కొట్టి దుస్తులు ఊడదీశారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. పలువురు ప్రముఖులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు వివేక్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు. మనం ముందు మనుషులమని, తర్వాత సోదరులమని, ఆ తర్వాతే భారతీయులమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇది దేశం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నట్టుగా మనుషుల్లో మానవత్వం కూడా అభివృద్ధి చెందితే బాగుండునని వివేక్ అన్నారు.
Go Back to Shorts
Actor
Vivek
Kollywood
Tamilnadu
Maharashtra

More Telugu News