అమెరికా సెక్స్‌ రాకెట్‌లో అప్రూవర్లుగా మారిన ముగ్గురు అగ్ర తారలు!

17-06-2018 Sun 07:42 | Both States
  • హీరోయిన్లను ఆరు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు
  • తమకు తెలిసిన వివరాలన్నీ వెల్లడించిన మహిళా నటులు
  • కిషన్ దంపతులపై బిగుస్తున్న ఉచ్చు
అమెరికాలో మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రకళ నిర్వహించిన సెక్స్ రాకెట్ లో భాగమైన టాలీవుడ్ హీరోయిన్లను 6 గంటల పాటు అమెరికా అధికారులు ప్రశ్నించగా, వీరు అప్రూవర్లుగా మారి తమకు తెలిసిన సమాచారమంతా వారికి చెప్పినట్టు తెలుస్తోంది. తెలుగు అసోసియేషన్ పత్రాలపై యూఎస్ కు వెళ్లిన వీరిలో బెంగళూరు, చెన్నైకు చెందిన ఇద్దరు అగ్రతారలు, ఫ్లాప్‌ అయిన ద్విభాషా చిత్రంలో నటించిన హీరోయిన్, ఈ మధ్యే బీజేపీలో చేరిన ఓ చిన్న నటి, కొన్ని తెలుగు బ్లాక్‌ బస్టర్స్‌ హిట్స్ లో నటించిన కన్నడ నటి, పలు సినిమాల్లో నటించినా పేరు తెచ్చుకోవడంలో విఫలమైన మరో హీరోయిన్‌ ఉన్నారు.

వీరు తెలుగు అసోసియేషన్ పత్రాలపై అమెరికాకు వెళ్లగా, కొన్ని వీసాలు హైదరాబాద్ కాన్సులేట్ నుంచే లభించాయి. కిషన్ చేతిలో చిక్కుకున్న ఓ నటి వాంగ్మూలం ఇస్తూ, తాను గత డిసెంబర్ 26న అమెరికాకు వెళ్లానని, పెన్సిల్వేనియాలో జరిగే నృత్య ప్రదర్శనకు పిలిచిన కిషన్, బలవంతంగా వ్యభిచారం చేయించడానికి ప్రయత్నించారని ఆరోపించింది. తాను వ్యభిచారం చేయలేదని, కస్టమర్లున్న గదిలో అరగంట సేపు బలవంతంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. మరో నటి మాట్లాడుతూ, చికాగోకు తనను పిలిపించిన కిషన్, మూడు నగరాలకు తిప్పారని, హోటల్ లో ఉంచి కస్టమర్లను పంపించే వాడని చెప్పింది. ఈ విషయాలు ఎక్కడైనా చెబితే తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడని వాపోయింది.

మరో నటి మాట్లాడుతూ, కిషన్ భార్య చంద్రకళ తనను హోటల్ కు తీసుకెళ్లి కస్టమర్లకు పరిచయం చేసి, పది నిమిషాల తరువాత వెళ్లిపోయేదని, ఆ తరువాత తనను తిరిగి వెనక్కు రప్పించేదని, రెండు ప్లాట్లతో ఉన్న కిషన్ ఇంట్లో ఒకదానిలో కిషన్, చంద్రకళ ఉండేవారని, రెండోదానిలో తనను ఉంచి విటులను పంపేవారని, తిరిగి వచ్చేందుకు వేరే మార్గం లేక వ్యభిచారం చేయాల్సి వచ్చిందని వాపోయింది.
TollywoodS*x RocketHeroinsApprovers

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more