హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ఓల్వో బస్సులు, రెండు లారీలు దగ్ధం
- బహదూర్‌పురలో భారీ అగ్నిప్రమాదం
- ఒమర్ ట్రావెల్స్ బస్సులు బూడిద
- కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు
స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చే సరికే మరో నాలుగు బస్సులు, పక్కనే ఉన్న రెండు లారీలకు మంటలు వ్యాపించి పూర్తిగా బూడిద చేశాయి. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకు రాగలిగారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలు ఆరా తీస్తున్నారు.