రేణూ దేశాయ్ కవితపై నెటిజన్ల స్పందన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేణూ దేశాయ్ కవితపై నెటిజన్ల స్పందన!

  • ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికాను.. అంటూ కొనసాగిన కవిత
  • నిజమైన ప్రేమ గురించి ఎంత బాగా వర్ణించారు
  • మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమించే వ్యక్తి దొరికారనుకుంటున్నా:  నెజిజన్ల స్పందన
నటి రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నారని, ఆమెకు సరైన భాగస్వామి దొరికినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో రేణూ దేశాయ్ చేసిన ఓ పోస్ట్ ఆసక్తి కరంగా ఉంది. రేణూ దేశాయ్ తాను చెప్పదలచుకున్న విషయాన్ని కవితాత్మక ధోరణిలో తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పొందుపరిచారు. ‘ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికాను... ఆ ప్రేమ కవిత్వంలో దొరుకుతుందని నేను అనుకుంటున్నా... నా చెయ్యి పట్టుకో, ఎప్పటికీ విడవకు..’ అంటూ ఆ కవిత సాగింది.

 కాగా, ఈ కవితపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ‘నిజమైన ప్రేమ గురించి ఎంత బాగా వర్ణించారు.. మాటల్లేవు’,‘మీ భవిష్యత్ జీవితానికి ఆల్ ది బెస్ట్’, ‘మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమించే వ్యక్తి దొరికారని అనుకుంటున్నా’ అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Rendu desai
poetic expression

More Telugu News