తెలుగులో అదితీరావు బిజీ కావడం ఖాయమట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగులో అదితీరావు బిజీ కావడం ఖాయమట!

  • ఆకట్టుకునే అందం .. అభినయం
  • స్టార్ హీరోయిన్ పాత్రలో జీవించేసింది 
  • తెలుగులో బిజీ అయ్యే అవకాశాలు      
మణిరత్నం సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులను పలకరించిన అదితీరావు, అదే సినిమా అనువాదమైన 'చెలియా' పేరుతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ఆ తరువాత అదితీరావు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'సమ్మోహనం' మూవీతోనే. ఇంద్రగంటి  మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే భారీస్థాయిలో విడుదలైంది.

ఈ సినిమా చూసినవాళ్లు 'సమీరా' పాత్రలో అదితీరావు అద్భుతంగా నటించిందని అంటున్నారు. స్టార్ హీరోయిన్ పాత్రలో ఆమె ఎంతో సహజమైన అభినయాన్ని కనబరిచిందని చెబుతున్నారు. ఆమె పాత్రను తెరపై చూస్తున్నంత సేపు .. నిజంగానే ఒక స్టార్ హీరోయిన్ ను దగ్గర నుంచి చూస్తున్నట్టుగా అనిపించిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందంతో .. అంతకుమించిన అభినయంతోను ఆమె నూటికి నూరు మార్కులు కొట్టేసిందని చెబుతున్నారు. ఇక తెలుగులో మరిన్ని ఛాన్సులతో ఆమె బిజీ కావడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.    
aditi rao

More Telugu News