లఘు చిత్రాల సంగీత దర్శకుడు అనురాగ్ ఆత్మహత్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లఘు చిత్రాల సంగీత దర్శకుడు అనురాగ్ ఆత్మహత్య

  • పలు షార్ట్ ఫిలింలకు పని చేసిన అనురాగ్
  • టాలీవుడ్ లోకి ఎంట్రీ కోసం ప్రయత్నాలు
  • వారం క్రితమే ఆత్మహత్య... ఆలస్యంగా వెలుగులోకి
వర్ధమాన సంగీత దర్శకుడు అనురాగ్ వినిల్ (నాని) ఆత్మహత్య ఉదంతం కలకలం రేపుతోంది. వారం క్రితమే అతను ఆత్మహత్యకు పాల్పడినప్పటికీ, ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మరోవైపు అతను ఎక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు? అనే విషయంలో విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ సమీపంలోని మర్పల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు చెబుతుండగా, హైదరాబాదులోని నాగోల్ మమతానగర్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని మరి కొందరు అంటున్నారు.

పలు షార్ట్ ఫిలింస్ కు అనురాగ్ పని చేశాడు. ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఈ ఘటన జరగడం అందరినీ కలచివేస్తోంది. అతని కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. నగరంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 9వ తేదీన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అనురాగ్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

music director
anurag
suicide
Tollywood

More Telugu News