68కి పతనమైన రూపాయి... మరికాస్త పతనం తప్పదు!
- ఇంట్రాడేలో 38 పైసలు తగ్గి రూ.68.02 స్థాయికి చేరిక
- బలపడిన డాలర్ ఇండెక్స్
- రానున్న రోజుల్లో ఇంకా తగ్గొచ్చని విశ్లేషకుల అంచనా
కానీ, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతోపాటు ఈ ఏడాది మరో రెండు పెంపులు ఉంటాయని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో యూరో కరెన్సీ విలువ డాలర్ తో పోలిస్తే పడిపోయింది. అదే సమయంలో డాలర్ ఇండెక్స్ బలపడింది. ఈ క్రమంలో మన రూపాయి కూడా పతనాన్ని చవి చూసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 68.02 కనిష్ట స్థాయిలో ట్రేడ్ అయింది. కరెంటు అకౌంట్ ఖాతా లోటు పెరగడం, ద్రవ్యోల్బణం సైతం పెరగడం, దేశీయ కరెన్సీకి శుభసూచకం కాదని, మరికాస్త బలహీనత ఉంటుందంటున్నారు విశ్లేషకులు.