ఏపీలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో క్షురకుల నిరసన... ఆగిన తలనీలాల మొక్కులు!
- విజయవాడ, శ్రీశైలం, అరసవెల్లిలో నిరసనలు
- వేతనాలు పెంచాలని క్షురకుల డిమాండ్
- మొక్కులు తీరేదెలాగంటూ భక్తుల ఆందోళన
కాగా, రెండువారాల క్రితం దుర్గగుడి క్షురకునిపై పాలకమండలి సభ్యుడు పెంచలయ్య చెయ్యి చేసుకున్న ఘటన కలకలం రేపగా, ఆయనపై చర్యలు తీసుకోలేదని క్షురకులు ఆరోపిస్తూ ఈ ఉదయం ధర్నాకు దిగారు. తమకు పాలకమండలి చైర్మన్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపించారు. స్థిర వేతనాలు తమకు లేవని, తలనీలాలు తీసిన అనంతరం భక్తులు సంతృప్తితో ఇచ్చే చిల్లరను కూడా తీసుకోనివ్వడం లేదని వారు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. ఇదే సమయంలో మిగతా దేవాలయాల క్షురకులు మూకుమ్మడిగా వారికి సంఘీభావం తెలిపి తమ డిమాండ్ల సాధనకు నడుం బిగించారని తెలుస్తోంది.