KCR: ఢిల్లీ బయలుదేరిన కేసీఆర్

  • బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పయనం
  • రేపు మోదీతో భేటీ 
  • పలు అంశాలపై చర్చ
తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. నాలుగు రోజుల తన పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు.

తెలంగాణలో ఏర్పాటు చేసిన కొత్త జోనల్‌ వ్యవస్థ, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్ల కోటా పెంపు వంటి పలు అంశాలపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, దేశంలో గుణాత్మక మార్పు కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై పలువురు నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతారని సమాచారం.      
KCR
Narendra Modi
New Delhi

More Telugu News