Jagan: హత్యా రాజకీయాలు జగన్ వారసత్వం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకే నాడు పరిటాల హత్య  
  • రాజమండ్రిలో వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారు
  • కేసుల మాఫీ కోసమే జగన్ బీజేపీ మానసపుత్రుడిగా మారారు
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హత్యా రాజకీయాలు జగన్ వారసత్వమని, మైనింగ్ మాఫియాను అడ్డుకుంటున్నారని చెప్పే నాడు పరిటాల రవిని హత్య చేయించారని ఆరోపించారు. రాజమండ్రిలో వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, జగన్ తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే బీజేపీ మానసపుత్రుడిగా మారారని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీపై, అధినేత చంద్రబాబుపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
Jagan
Gorantla Butchaiah Chowdary

More Telugu News