test match: మురళీ విజయ్ సెంచరీ.. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ

  • భారత్ స్కోరు 284/2
  • 105 పరుగులకు ఔట్ అయిన మురళీ
  • క్రీజులోకి వచ్చిన పుజారా
బెంగళూరులో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ పై ఇండియన్ బ్యాట్స్ మెన్ విరుచుకుపడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా అలవోకగా పరుగులు సాధిస్తోంది. ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు సాధించారు.

శిఖర్ ధావన్ 107 పరుగులకు ఔట్ కాగా... మురళీ విజయ్ 105 (1 సిక్స్, 15 ఫోర్లు) పరుగులకు పెవిలియన్ చేరాడు. వఫాదార్ బౌలింగ్ లో మురళీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో టెస్టుల్లో తన 12వ శతకాన్ని సాధించాడు. మరో ఎండ్ లో కేఎల్ రాహుల్ 54 (8 ఫోర్లు) పరుగులతో ఆడుతున్నాడు. రాహుల్ కు పుజారా (4) జత కలిశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 284 పరుగులు. ఈ రోజు ఆటను వర్షం రెండు సార్లు అడ్డుకోవడం గమనార్హం.
test match
murali vijay
pujara
kl rajul
bengaluru

More Telugu News