నితిన్ ప్లాప్ సినిమాకి 50 మిలియన్ల వ్యూస్!

  • నితిన్ హీరోగా వచ్చిన 'లై'
  • తెలుగులో భారీ ప్లాప్ 
  • హిందీలోకి అనువాదం   
హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ 'లై' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకి మేఘ ఆకాశ్ కథానాయికగా పరిచయమైంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో విలన్ గా కనిపించారు. ఎక్కువభాగం ఫారిన్ లోనే చిత్రీకరించబడిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

నితిన్ తో పాటు ఆయన అభిమానులను ఈ సినిమా నిరుత్సాహపరచడమే కాకుండా, భారీస్థాయిలో నష్టాలను తెచ్చిపెట్టింది. అలాంటి ఈ సినిమా హిందీలోకి డబ్  చేయబడింది. హిందీ డబ్ మూవీకి యూట్యూబ్ లో 50 మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. తెలుగులో అంతగా ఆదరణ పొందని ఈ సినిమా యూట్యూబ్ లో ఈ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుని అరుదైన రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ 'శ్రీనివాస కల్యాణం' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  
Go Back to Shorts
nithin
megha akash

More Telugu News