Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సూపర్ డీలక్స్' షూటింగును పూర్తిచేసిన సమంత

  • అరణ్య దర్శకత్వంలో 'సూపర్ డీలక్స్'
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
  • ముఖ్యమైన పాత్రలో రమ్యకృష్ణ
ఈ ఏడాది ప్రథమార్థం సమంతకి ఒక రేంజ్ లో కలిసొచ్చిందనే చెప్పాలి. తెలుగులో ఆమె నటించిన 'రంగస్థలం' .. 'మహానటి' సినిమాలు భారీ విజయాలను సాధించగా, విశాల్ జోడీగా చేసిన 'ఇరుంబు తిరై'(అభిమన్యుడు) తెలుగు .. తమిళ భాషల్లో ఘన విజయాన్ని అందుకుంది. ఇలా చాలా తక్కువ గ్యాప్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన సమంత, తాజాగా తమిళంలో 'సూపర్ డీలక్స్' సినిమా షూటింగును పూర్తిచేసింది.

విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ .. మిస్కిన్ .. రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాకి 'అరణ్య' దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో సమంత పాత్రకి సంబంధించిన షూటింగ్ రీసెంట్ గా పూర్తయింది. అందువలన ఈ సినిమా యూనిట్ సభ్యులు సమంతతో కేక్ కట్ చేయించి సెండాఫ్ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు.    
samanta

More Telugu News