అభిమానుల కోసం అలసటను లెక్కచేయని చిరూ
- 'సైరా' షూటింగులో చిరంజీవి
- డిసెంబర్ నాటికి చిరూ పోర్షన్ పూర్తి
- జనవరి నుంచి కొరటాలతో సెట్స్ పైకి
ఇటీవల ఒకవైపున మండుటెండల్లోను .. మరో వైపున లైట్ల వేడిని తట్టుకుంటూ ఆయన యాక్షన్ సీన్స్ లో పాల్గొన్నారు. వాతావరణం అనుకూలించని కారణంగా చిరూ అలసటకు లోనవుతున్నా, అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో అలసటను లెక్కచేయలేదట. ఈ సినిమాకి సంబంధించి డిసెంబర్ నాటికి చిరంజీవి పోర్షన్ ను పూర్తి చేస్తారట. ఆ తరువాత మిగతా సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతుంది. జనవరి నుంచి కొరటాల సినిమాతో చిరంజీవి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే కొరటాల నిమగ్నమై వున్నాడట.