కార్మికుల సమ్మె.. తెలంగాణలో 800 గ్రామాలకు నిలిచిన కృష్ణా జలాల సరఫరా!
- సమ్మె ప్రారంభించిన నల్గొండ ఆర్ డబ్ల్యూఎస్ కార్మికులు
- మూకుమ్మడి సమ్మెతో నిలిచిన ట్యాంకర్లు
- సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామన్న అధికారులు
దీంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. కార్మికులు చెప్పా పెట్టకుండా సమ్మెకు దిగారని అధికారులు చెబుతుండగా, సమ్మెకు తాము ముందుగానే నోటీసులు ఇచ్చామని, అధికారులు పట్టించుకోలేదని కార్మికులు ఆరోపించారు. సమస్యను పరిష్కరించేందుకు కార్మికులతో చర్చలు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.