మూడేళ్ల క్రితం నేను పడ్డ టెన్షన్.. ఇప్పుడు అన్నయ్య పడుతున్నట్టు ఉంది: జూనియర్ ఎన్టీఆర్
- 'నాన్నకు ప్రేమతో' సినిమాలో నా గెటప్ ను ఆదరిస్తారో, లేదో అని చాలా టెన్షన్ పడ్డా
- నిజాయతీగా పని చేస్తే ప్రేక్షక దేవుళ్లు ఆదరిస్తారు
- 'నా నువ్వే' సినిమా పెద్ద హిట్ అవుతుంది
'నా నువ్వే' సినిమాలో అన్నయ్య పడిన కష్టం, టెన్షన్ వృథాగా పోదని తారక్ అన్నాడు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించాడు. ఇలాంటి చిత్రంలో నటించాలనే అన్నయ్య కోరికను నిజం చేసిన దర్శకుడు జయేంద్రకు థ్యాంక్స్ చెబుతున్నానని తెలిపాడు. ఇలాంటి ప్రయత్నం చేయాలంటే దర్శక నిర్మాతలకు ఎంతో ధైర్యం ఉండాలని చెప్పాడు.