కాలేజ్ రోజుల్లో అలాంటి అబ్బాయిల్ని కొట్టేశాను: నటి ప్రగతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాలేజ్ రోజుల్లో అలాంటి అబ్బాయిల్ని కొట్టేశాను: నటి ప్రగతి

  • నన్ను అంతా 'రౌడీ రంగమ్మ' అనే వారు 
  • అమ్మాయిలను ఏడిపిస్తే సహించేదాన్ని కాదు 
  • అబ్బాయిలకి నాలుగు తగిలించేదాన్ని    
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ ప్రగతి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఫలానా పాత్రకి ప్రగతి అయితే బాగుంటుంది .. ఆమె అయితేనే ఫలానా పాత్రకి న్యాయం జరుగుతుందని దర్శక నిర్మాతలు గుర్తించే స్థాయికి చేరుకున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, కాలేజ్ డేస్ గురించి ప్రస్తావించారు.

"కాలేజ్ రోజుల్లో నన్ను 'రౌడీ రంగమ్మ' అని పిలిచేవారు. అదేంటో తెలియదు గానీ ఎవరైనా అబ్బాయిలు .. అమ్మాయిలను తక్కువగా చూసినా, టీజ్ చేసినా ..  ర్యాగింగ్ చేయడానికి ప్రయత్నించినా నేను ఎంతమాత్రం సహించేదానిని కాదు. ఆ సమయంలో నాలో వున్న చంద్రముఖి బయటికి వచ్చేసేది. అమ్మాయిలను ఏడిపించే అబ్బాయిలకి అక్కడే నాలుగు తగిలించే దానిని .. నాలుక మడతేసి చూపుడు వేలుతో బెదిరించేదానిని. ఈ తరహా పనులు చేయడానికి ఒక గ్యాంగ్ ను కూడా వెంటేసుకు తిరిగేదానిని" అని చెప్పుకొచ్చారు.    
pragathi
ali

More Telugu News